నర్సింగ్‌ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, స్టైఫండ్‌ భారీగా పెంపు

Good news for nursing students, Govt Increased Stipend for Nursing Students, Mango News, Nursing Students Stipend, Nursing Students Stipend Hike, Nursing Students Stipend Hike News, Nursing Students Stipend Increased, Nursing students thank CM KCR for increasing stipend, Stipend, Stipend for Nursing Students, telangana, Telangana Govt, Telangana Govt Increased Stipend for Nursing Students, Telangana Govt Increased Stipend for Nursing Students in the State

రాష్ట్రంలో నర్సింగ్‌ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్‌ విద్యార్థులకు (జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్‌), ఎమ్మెస్సీ నర్సింగ్‌) స్టైఫండ్‌ ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నర్సింగ్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు వెంటనే అమలులోకి రానుందని పేర్కొన్నారు.

జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్‌) విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు వివరాలు:

  • మొదటి సంవత్సరం – రూ.1,500 నుంచి రూ.5,000 కు పెంపు.
  • రెండో సంవత్సరం – రూ.1,700 నుంచి రూ.6,000 కు పెంపు.
  • మూడో సంవత్సరం – రూ.1,900 నుంచి రూ.7,000 కు పెంపు.
  • నాలుగో సంవత్సరం – రూ.2,200 నుంచి రూ.8,000 కు పెంపు.

ఎమ్మెస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ పెంపు వివరాలు:

  • మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.9 వేలు.
  • రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.10 వేలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 8 =