తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 4009 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 18, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో పద్నాలుగు మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1838 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 1878 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 3,14,441 కు చేరుకుంది. ప్రస్తుతం 39,154 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాడు 83,089 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,18,20,842 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 3,17,593 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ