జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్, ధాన్యం సేకరణ, సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలపై ఆదేశాలు

CS Somesh Kumar, CS Somesh Kumar held Teleconference with District Collectors, CS Somesh Kumar held Teleconference with District Collectors over Paddy Procurement, District Collectors over Paddy Procurement, Mango News, Paddy Procurement, Paddy procurement across Telangana, Paddy Procurement Centers, Paddy procurement In Telangana, Paddy Procurement System, Telangana CS Somesh Kumar, Teleconference with District Collectors over Paddy Procurement

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై సెక్రటేరియట్ నుండి గురువారం నాడు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక మార్కెట్ ల నుండి కార్మికులను సమీకరించుకోవాలని, గోనె సంచులు (గన్నీ బ్యాగ్స్) సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యం రవాణాకు వాహనాలు తగినంతగా లభించేలా చూడాలని, మిల్లర్లు తూకాలలో విధిస్తున్న అనవసర కోతలను అరికట్టేందుకు తనిఖీలు చేయాలని వారికి సూచించారు. గోనె సంచుల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే విత్తనాలు మరియు ఎరువులు విక్రయాల సమయంలో తగినంత నిల్వలు అందుబాటులో ఉండాలని తెలిపారు. తదనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులతో సవివరమైన సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.

సూపర్ స్ప్రెడర్ కేటగిరీల కోసం ప్రతిపాదించిన టీకా డ్రైవ్‌కు సంబంధించి, ప్రభుత్వం నిర్దేశించిన వర్గాలకు టీకాలు వేయాలని, లైన్ జాబితాను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. అంతేకాకుండా ఈ వర్గాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే వేయడాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎమ్ రిజ్వీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =