లోయర్ మానేరు రివర్ : 4 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.310.46 కోట్లు విడుదల

Development of Mid Manair River, Development of Mid Manair River Telangana, Govt Released Rs 340.46 Cr for Development of Mid Manair River, Mango News, Mid Manair Dam, Mid Manair Dam is a dream come true, Mid Manair River, Mid Manair River Development, Mid Manair River Development Works, Telangana Budget, Telangana Govt Released Rs 340.46 Cr for Development, Telangana Govt Released Rs 340.46 Cr for Development of Mid Manair River, Telangana Mid Manair River

లోయర్ మానేరు నదిని సుందరీకరించడం, పటిష్టపరచడం కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను రూ.310.464 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీఓ కాపీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా తన చేతుల మీదుగా మంత్రి గంగుల కమలాకర్ కు శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో అందచేశారు. ఈ జీఓ కాపీని అందుకున్న మంత్రి గంగుల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

మానేరు రివర్ ఫ్రంటు నిర్మాణ పనుల డీపీఆర్ తయారీకి టెండర్ ఖరారు కోసం విధి విధానాలను రూపొందించడానికి గాను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో జూన్ 12న సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా మానేరు రివర్ ఫ్రంటులో భాగంగా రూ.80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జీ నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − two =