ఏప్రిల్ 30న డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభం

CM KCR Announced Telangana New Secretariat will Inaugurate on April 30th,CM KCR Announcement,CM KCR about New Secretariat, New Secretariat Inaugurate on April 30th,Telangana New Secretariat Announced,Mango News,Mango News Telugu,Telangana Secretariat complex,KCR inspects works at Secretariat,Telangana new Secretariat to be inaugurated,CM KCR to inaugurate New Secretariat,New Secretariat Opening Date Fixed,CM KCR News And Live Updates,Telangana News Today,Telangana Political News And Updates,Telangana Latest News and Updates,Hyderabad News

డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణ నూత‌న స‌చివాల‌యాన్ని ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్ర‌క‌టించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించారు. స‌చివాల‌య భవనం ప్రారంభోత్స‌వానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా పార్టీలో అన్ని స్థాయిల నాయ‌కులు హాజ‌రవుతార‌ని సీఎం పేర్కొన్నారు. గతంలో ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా, రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ క్రమంలో ఫిబ్రవరి 17న నిర్ణయించిన సచివాలయం ప్రారంభోత్సవం గురించి సీఎస్, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరపగా, వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆశాజనకంగా లేకపోవడంతో రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 17 నుండి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ నూత‌న స‌చివాల‌యాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క 125 అడుగుల భారీ విగ్రహన్ని ఏప్రిల్ 14న ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే తెలంగాణ అమర వీరుల స్మారకార్ధం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతిని జూన్ 1న ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 9 =