జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా.సినారె వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు

CM KCR Paid Tributes to Dr C Narayana Reddy, CM KCR Paid Tributes to Dr C Narayana Reddy on his Death Anniversary, Dr C Narayana Reddy, Dr C Narayana Reddy Death Anniversary, KCR pays tribute to Telugu poet C Narayana Reddy, Mango News, Telangana CM pays tribute to renowned poet Narayana Reddy, Telugu poet C Narayana Reddy, Telugu poet C Narayana Reddy Death Anniversary, Tributes to Dr C Narayana Reddy, Tributes to Dr C Narayana Reddy on his Death Anniversary

తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా.సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులర్పించారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని సీఎం అన్నారు. ప్రకృతీ మానవ తాత్వికతను ఆవాహనం చేసుకున్న ద్రష్ట, తెలంగాణ జాతికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన సాహితీ స్రష్ట సినారె అని సీఎం కేసీఆర్ కొనియాడారు .

దక్కనీ ఉర్దూ తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీలను చేసి, గజల్స్ తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తహజీబ్ కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని సీఎం గుర్తు చేసుకున్నారు. దేశీయ అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేకస్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అని సీఎం అన్నారు. భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్ళూ ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =