తెలంగాణలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23 విడుదల,సెలవులు, పరీక్షల వివరాలివే…

Telangana School Education Department Releases Academic Calendar for 2022-23, TS School Education Department Releases Academic Calendar for 2022-23, School Education Department Releases Academic Calendar for 2022-23, Academic Calendar for 2022-23, TS High School Academic Calendar 2022-2023, academic Calendar of 2022-23 academic year released, TS School Academic Calendar, Telangana School Education Department, TS School Education Department, Academic Calendar, TS School Academic Calendar News, TS School Academic Calendar Latest News, TS School Academic Calendar Latest Updates, TS School Academic Calendar Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతి వరకు) అకడమిక్ క్యాలెండర్ పై బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ స్పెష‌ల్ చీఫ్‌ సెక్ర‌ట‌రీ వాకాటి అరుణ ఉత్త‌ర్వులు జారీ చేశారు. 2022-23 సంవత్సరానికి గానూ మొత్తం 230 రోజులును ప‌ని దినాలుగా నిర్ణయించారు. 2022-23 విద్యాసంవత్సరం ఏప్రిల్ 24, 2022తో (చివరిపనిదినం) ముగుస్తుందని తెలిపారు. ఇక పదో తరగతిలో అన్ని సబ్జెక్టుల సిల‌బ‌స్ ను జ‌న‌వ‌రి 10, 2023 లోగా పూర్తి చేయనున్నారు. అనంతరం రివిజన్ తరగతులు ఉంటాయని, పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైన‌ల్ పరీక్షలు ఫిబ్రవరి 28 లోపు, ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలను మార్చి నెలలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

1-9 తరగతుల విద్యార్థులకు సిల‌బ‌స్ ను ఫిబ్రవరి 28, 2023 లోగా పూర్తి చేస్తామని, సమ్మేటివ్ అస్సేస్మెంట్ (ఎస్ఏ)-2 ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ 10 నుంచి 17 వ‌ర‌కు నిర్వ‌హించనున్నట్టు ప్రకటించారు. ప్రతి నెలలో మూడో శనివారం నో బ్యాగ్‌ డే గా పాటించాలని చెప్పారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. మరోవైపు ప్రతిరోజు స్కూల్‌ అసెంబ్లీలో లేదా అసెంబ్లీ తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చారు. 2023-24 విద్యాసంవత్సరానికి పాఠశాలల పునఃప్రారంభం జూన్‌ 12, 2023 నుంచి ఉంటుందని పేర్కొన్నారు.

పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23:

  • ప్రారంభతేది: జూన్ 13
  • చివరి పనిదినం: ఏప్రిల్ 24, 2023

పరీక్షల షెడ్యూల్:

  • ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌ (ఎఫ్ఏ)-1 : జూలై 27 లోగా
  • ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌-2 : సెప్టెంబర్ 5 లోగా
  • సమ్మెటివ్ అసెస్‌మెంట్‌ ఎస్ఏ-1: నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు
  • ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌-3 : డిసెంబర్ 21 లోగా
  • ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌-4 : పదో తరగతి విద్యార్డులకు జనవరి 31 లోగా, 1-9 తరగతులకు ఫిబ్రవరి 28 లోగా
  • సమ్మెటివ్ అసెస్‌మెంట్‌ ఎస్ఏ-2 (1-9 తరగతులకు) : ఏప్రిల్ 10, 2023 నుంచి ఏప్రిల్ 17, 2023 వరకు
  • పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు : ఫిబ్రవరి 28 లోగా
  • పదో తరగతి బోర్డు పరీక్షలు : మార్చి, 2023

సెలవుల వివరాలు:

  • ద‌స‌రా సెల‌వులు : సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు (14 రోజులు)
  • క్రిస్మ‌స్ సెల‌వులు (మిషనరీ పాఠశాలలకు) : డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు (7 రోజులు)
  • సంక్రాంతి సెల‌వులు : జనవరి 13, 2023 నుంచి జనవరి 17, 2023 వరకు (5 రోజులు)
  • వేసవి సెలవులు: ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =