టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: ‘సిట్’ విచారణకు హాజరుకాని ఆ ముగ్గురు, లుకౌట్ సర్క్యులర్ జారీ

Trs Mlas Poaching Case Sit Issues Lookout Circular On Three Persons After Not Attending For The Enquiry,Trs Mlas Purchase Case,Those Three Didn'T Attend Sit Hearing,Lookout Circular Issued,Mango News,Mango News Telugu,Trs Mla Poaching Case,Mla Poaching Case,Trs Poaching Case,Sit Issues,Sit Issues Lookout Circular,Three Persons After Not Attending,Sit Enquiry,Special Investigation Team,Telangana Sit

తెలంగావ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగమున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని విచారించడానికి ఇప్పటికే సమన్లు జారీ చేసిన సిట్, వారిని సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే వారిలో కేవలం ఒక్కరు మాత్రమే విచారణకు హాజరవగా, మిగిలిన ముగ్గురూ గైర్హాజరయ్యారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అత్యంత సన్నిహితుడైన కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్‌ శ్రీనివాస్‌ ఒక్కరే సోమవారం సిట్‌ ఎదుట హాజరయ్యారు.

దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సిట్ అధికారులు కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్‌లపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్న రాజేంద్రనగర్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు. భారతదేశం అంతటా అన్ని పోలీసు యూనిట్ అధికారులు తమ అధికార పరిధిలోని పోలీసు స్టేషన్‌లకు లుకౌట్ నోటీసును తెలియజేయాలని మరియు హైదరాబాద్ సిటీ కంట్రోల్ రూమ్‌కు వాంటెడ్ వ్యక్తులకు సంబంధించిన ఏవైనా ఆధారాలను అందించాలని నోటీసులో కోరారు. అలాగే దీనిలో ఏసీపీ రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ డీసీపీ, మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన అన్ని సంస్థల కాంటాక్ట్ నంబర్‌లను కూడా అందించారు.

తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భారీ మొత్తంలో లంచం ఇచ్చి బిజెపిలోకి ఫిరాయించే కుట్రలో కీలక పాత్ర పోషించారని లుకౌట్ నోటీసులో తెలిపారు. వీరిపై ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు, అస్థిరపరిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి ప్రేరేపించినట్లు కేసు నమోదైందని స్పష్టం చేశారు. ఇక అడ్వకేట్‌ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 17వ అంతస్తులోని సిట్‌ కార్యాలయంలో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. తెలంగాణ సహా మొత్తం 3 దక్షిణాది రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ప్రభుత్వాలను కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు వెలుగుచూసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 19 =