డిసెంబర్ 1 నుండి వారంలో 5 రోజుల పాటు రాష్ట్రపతి భవన్ సందర్శనకు అవకాశం

Rashtrapati Bhavan Will Be Open For Public Viewing For Five Days In A Week From December 1 2022,Rashtrapati Bhavan Public Viewing,Rashtrapati Bhavan,Rashtrapati Bhavan Open For Five Days,Rashtrapati Bhavan Latest News And Updates,Rashtrapati Bhavan News,Telangana Rashtrapati Bhavan,Telangana Latest News,Telangana State Rashtrapati Bhavan,Telangana State News And Updates,Telangana Governer Tamilasai Soundarrajan,Governer Latest News,Telangana Governer,Telangana Cm Kcr

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ 2022, డిసెంబర్ 1 నుండి వారంలో ఐదు రోజుల పాటు ప్రజల సందర్శనకు తెరిచి ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో ప్రజలు/సందర్శకులు పర్యటించేందుకు బుధ, గురు, శుక్ర, శని మరియు ఆదివారాల్లో (గెజిటెడ్ సెలవులు మినహా) అనుమతి ఉంటుందన్నారు. ఆయా రోజుల్లో ఐదు టైమ్ స్లాట్‌లలో అనగా ఉదయం 10.00-11.00 గంటలు, 11.00-12.00, 12.00-13.00, 14.00-15.00 మరియు 15.00-16.00 మధ్య ఒక్కొక్కరికి గంట చొప్పున రాష్ట్రపతి భవన్ సందర్శనకు ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అలాగే రాష్ట్రపతి భవన్ పర్యటనతో పాటుగా ప్రజలు మంగళవారం నుండి ఆదివారం వరకు (గెజిటెడ్ సెలవులు మినహా) వారానికి ఆరు రోజులు రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్‌ని సందర్శించవచ్చని తెలిపారు. ఇక ప్రతి శనివారం నాడు ప్రజలు రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్ట్‌లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు గార్డ్ మార్పు వేడుకను కూడా చూడవచ్చన్నారు. గెజిటెడ్ హాలిడే అయినా లేదా రాష్ట్రపతి భవన్ నోటిఫై చేసినా శనివారం రోజు వేడుక జరగదు అని తెలిపారు. రాష్ట్రపతి భవన్ ను సందర్శించాలనుకునే వారు http://rashtrapatisachivalaya.gov.in/rbtour వెబ్‌సైట్‌లో తమ స్లాట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =