రైతుబంధు : మూడో రోజున 5,49,891 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.687.89 కోట్లు జమ

Rythu Bandhu Distribution: Rs 687.89 Cr Deposited in Accounts of 5.49 Lakh Farmers on 3rd Day,Rythu Bandhu will Deposit,CM KCR 100 Cr for Kondagattu Anjanna Temple,Kondagattu Anjanna Temple Devolepment,Kondagattu Anjanna Temple,Rythu Bandhu,Telangana Rythu Bandhu,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతులకు రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో రోజైన డిసెంబర్ 30, శుక్రవారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. మూడో రోజు మొత్తం 5,49,891 మంది రైతుల ఖాతాలలో రూ.687.89 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. కాగా డిసెంబర్ 28న తొలి రోజు 21,02,822 మంది రైతుల ఖాతాల్లో రూ.607.32 కోట్లు, డిసెంబర్ 29న రెండో రోజు 15.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,218.38 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే.

పెట్టుబడి కోసం ఒకనాడు చేయిచాచిన రైతులు నేడు ప్రభుత్వ సాయంతో ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలు ఏవీ లేవని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. “రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరధ పథకాలు ఏవీ కేసీఆర్ ఎన్నికలలో హామీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆసరా ఫించను వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 కాగా, సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఫించన్లను రూ.2016, రూ.3016కు పెంచారు. గురుకులాలతో విద్యారంగంలో, వైద్యకళాశాలలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దేశంలో రైతుకు చేయూతనిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. పనిచేసిన ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఉంటుంది. అబద్దపు ప్రచారాలతో ప్రజల దృష్టి మళ్లించాలననుకోవడం అత్యాశ. కేసీఆర్ నాయకత్వం మీద ప్రజలకు అపారవిశ్వాసం ఉంది” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =