టీఎస్ పాలిసెట్‌-2021 ఫలితాలు విడుదల, పాలిసెట్ ప్రవేశాల షెడ్యూల్ ఇదే…

Mango News, POLYCET Results, Telangana TS POLYCET Results 2021, Telangana TS POLYCET Results 2021 released, TS POLYCET 2021 result announced, TS POLYCET Result 2021, TS POLYCET Result 2021 Declared, TS Polycet Result 2021 Out, TS Polycet Result Out, TS Polycet Results 2021, TS POLYCET-2021 Results, TS POLYCET-2021 Results Released, TS POLYCET-2021 Results Released Today

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కమిషనర్ నవీన్ మిట్టల్ జూలై 28, బుధవారం నాడు విడుదల చేశారు. జూలై 17న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 92,557 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 81.75 శాతం అనగా 75,666 అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 53,371 బాలురకు గాను 42,595 మంది (79.81 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇదే విధంగా హజరైన 39,186 బాలికలకుగాను 33,071 మంది (81.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా https://polycetts.nic.in, www.sbtet.telangana.gov.in, www.dtets.cgg.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు టీఎస్‌ పాలిసెట్‌-2021 ప్రవేశ పక్రియ షెడ్యూల్ ను కూడా ఇప్పటికే విడుదల చేశారు.

టీఎస్‌ పాలిసెట్‌-2021 ప్రవేశాల షెడ్యూల్:

 • ఆగస్టు 5 నుంచి‌ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
 • ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువీకరణపత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్
 • ఆగస్టు 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
 • ఆగస్టు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్స్
 • ఆగస్టు 14 న మొదటి విడత సీట్లు కేటాయింపు
 • ఆగస్టు 23 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
 • ఆగస్టు 24 తుది విడత సర్టిఫికెట్ల పరిశీలన
 • ఆగస్టు 24, 25 న వెబ్‌ ఆప్షన్స్
 • ఆగస్టు 17 న తుది విడత సీట్లు కేటాయింపు
 • సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్‌ విద్యా సంవత్సరం ప్రారంభం.
 • సెప్టెంబర్ 9 న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here