టిఎస్ఆర్టీసీకి సంక్రాంతి సమయంలో రూ.139.34 కోట్ల ఆదాయం

Mango News Telugu, Political Updates 2020, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, TSRTC Got 139 Crores Income, TSRTC Got 139 Crores Income In Sankranthi Festival Time, TSRTC Income For Sankranthi Festival, TSRTC Latest News
సంక్రాంతి పండుగ సందర్భంగా టిఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. పండుగ సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు పదిరోజుల పాటు 5,052 బస్సులను నడిపి రూ.139.34 కోట్ల ఆదాయాన్ని టిఎస్ఆర్టీసీ ఆర్జించింది. గత సంవత్సరం సంక్రాంతి సమయంలో రూ.121.30 కోట్లు ఆదాయం రాగా, ఈసారి రూ.18.04 కోట్లు అదనంగా లభించడం విశేషం. పండుగ సెలవులు ముగిసిన జనవరి 20న సంస్థకు అత్యధికంగా రూ.16.57 కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. ఇటీవలే కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచడం కూడా సంస్థకు కలిసివచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పండుగ సమయంలో రెగ్యులర్‌ సర్వీసుల చార్జీల కంటే కొంత శాతం అధిక చార్జీలను వసూలు చేయడంతో గతఏడాది కంటే ఆదాయం మరింతగా పెరిగింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =