ఏపీ పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్.. 2,050 పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Police Recruitment 2026 SLPRB Released Notification For 2,050 Posts

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీసు శాఖలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SI), పోలీస్‌ కానిస్టేబుల్‌ (PC)తో పాటు ఫైర్‌మెన్‌, వార్డర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, కమ్యూనికేషన్‌, మెకానిక్స్‌, డ్రైవర్ల పోస్టులు ఉన్నాయి.

ఈ నియామకాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు.

భర్తీ చేయనున్న పోస్టులు వివరాలు..

  • 09 SI (SPF) పోస్టులు – పురుషులకు
  • 50 SCT SI (కమ్యూనికేషన్‌) పోస్టులు – పురుషులు, మహిళలు
  • 10 SI (PTO) పోస్టులు
  • 43 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (FSL) పోస్టులు
  • 827 PC (సివిల్‌/AR) పోస్టులు – పురుషులు, మహిళలు
  • 158 ఫైర్‌మెన్‌ పోస్టులు – రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ
  • 171 వార్డర్‌ పోస్టులు – పురుషులు, మహిళలు
  • 200 PC (కమ్యూనికేషన్‌) పోస్టులు – పురుషులు, మహిళలు
  • 213 PC (మెకానిక్స్‌, డ్రైవర్లు) పోస్టులు – పురుషులకు

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష తేదీని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, అర్హత ఉన్న పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here