ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌ ప్రతిపాదన, ఆమోదించిన సభ

AP Assembly Approves The New Ruling Proposal on Conduct of MLAs in House The New Ruling Proposal on Conduct of MLAs in House, AP Assembly Approves The New Ruling Proposal, AP Assembly Budget Session, Assembly Session 2022, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌ ప్రవేశపెట్టారు. వైట్‌, గ్రీన్‌, రెడ్‌ లైన్స్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన‌కు సభ ఆమోదం తెలిపింది. కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం సభలో ఎవరైనా సభ్యులు ప్రతిపాదిత లైన్స్‌ దాటితే ఆటోమాటిక్‌గా సస్పెన్షన్‌కు గురవుతారు. దీనిపై రూల్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచించారు. సభను హుందాగా నడిపేందుకే ఈ కొత్త రూల్‌ తీసుకువచ్చామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఈ క్రమంలో.. అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు.

ఈ ఉదయం సమావేశాలు మొదలైనప్పటి నుంచి సభను అడ్డుకోవడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. టీడీపీ సభ్యులను శాసనసభ నుంచి ఒకరోజు సస్పెన్షన్‌ చేశారు. సస్పెన్షన్‌కి గురైన టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు, సాంబశివరావు, సత్యప్రసాద్‌. కాగా, నిన్న అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిలను స్పీకర్ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + two =