ఈ సర్వేను ప్రజలు నమ్మరన్న అమర్‌నాథ్

Minister's reaction, PK survey, Amarnath, PK,Prashant Kishore.., AP elections, CM Jagan,chandrababu,Prashant Kishor,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,Mango News Telugu,Mango News
Minister's reaction, PK survey, Amarnath, PK survey,Prashant Kishore.. AP elections, CM Jagan

ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతుందంటూ చెబుతోన్న ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని చెప్పారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి విశాఖలో మాట్లాడిన ఆయన..ప్రముఖ స్ట్రాటజిస్ట్ పీకేకు  కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒక పీకే సరిపోడని, రెండో పీకేని తెచ్చుకున్నారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.

ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు 2,3 గంటలు భేటీ అయ్యారన్న అమర్ నాథ్.. చంద్రబాబు, ప్రశాంత కిషోర్ చెల్లని రూపాయలంటూ ఘాటుగా విమర్శించారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందా అంటూ పీకేపై సెటైర్లు వేశారు.   పీకే సర్వేలు ప్రజలు నమ్మే రోజులు పోయాయని  మంత్రి చెప్పుకొచ్చారు.

అయితే హైదరాబాద్‌లో తాజాగా జరిగిన పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఏపీ ఎన్నికలపై స్పందించి చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న పీకే..సీఎం జగన్ ఈసారి ఏం చేసినా సరే మళ్లీ  గెలవడం కష్టమని తేల్చి చెప్పేయడంతో వైసీపీ వర్గాలు కంగుతిన్నాయి.

ఏపీలో త్వరలో రాబోతున్న ఎన్నికల్లో సీఎం జగన్ ఘోర ఓటమిని చవి చూడబోతున్నారని పీకే జోస్యం చెప్పారు. ప్రజల బాగోగులు చూస్తున్నామని చెప్పి.. వాళ్ల సొమ్మునే ఖర్చు చేయడం తప్పని వివరించిన ప్రశాంత కిషోర్..ఇలా చేయడం వల్ల ఆయన రాజకీయంగా ఎంతో నష్టపోబోతున్నారని చెప్పారు.

అంతెందుకు రీసెంటుగా  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఇదే జరిగిందంటూ  షాకింగ్స్ కామెంట్స్ చేశారు. నేతలు తమ పాలన కాలంలో ఏం చేశారనేది ప్రజలు గమనిస్తారని..విద్య, ఉపాధి, డెవలప్మెంట్ వంటి  ఎన్నికల్లో కీలకంగా ప్రభావం చూపిస్తాయని అన్నారు. సీఎం జగన్ తన ప్యాలెస్‌లో కూర్చుని బటన్లు నొక్కితే..ఓట్లు పడవని ప్రశాంత కిషోర్ కాస్త ఘాటుగానే చెప్పారు.

అయితే 2019 ఎన్నికల్లో  జగన్ కోసం.. పీకే ఐప్యాక్ టీమ్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించింది. అయితే ఆ ఎన్నికల తర్వాత జగన్‌కు ప్రశాంత కిషోర్‌కు గ్యాప్ రాగా.. సీఎంతోనూ,పార్టీతోనూ సంబంధాలు తెంచుకున్నారు.ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేసిన పీకే.. రాబోయే ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారని  చెప్పడమే హాట్ టాపిక్ గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 15 =