ఏపీలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయండి.. కిటెక్స్‌కు మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం

Minister Nara Lokesh Meets Kitex MD Sabu M. Jacob in Kochi, Invites Investment in AP

ఆంధ్రప్రదేశ్‌లో టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీ సబు ఎం. జాకబ్‌ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానించారు. కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో సబు జాకబ్‌తో లోకేశ్‌ సమావేశమై వస్త్ర పరిశ్రమ, తయారీ రంగంలో అవకాశాలు, ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు.

కిటెక్స్‌ కర్మాగారాన్ని సందర్శించిన లోకేశ్‌

సబు జాకబ్‌ ఆహ్వానం మేరకు లోకేశ్‌ కొచ్చిలోని కిటెక్స్‌ గార్మెంట్స్‌ కర్మాగారాన్ని సందర్శించారు. అక్కడ వస్త్రాల తయారీ, ఉత్పత్తి ప్రక్రియ, పరిశ్రమలోని కార్యకలాపాలను పరిశీలించారు. ఏపీలోనూ తయారీ రంగం విస్తరణకు అనుకూల వాతావరణం ఉందని లోకేశ్‌ వివరించారు. కిటెక్స్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలను కొనసాగించనుంది.

ఏపీలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు ఆహ్వానం

ఏపీలో భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కిటెక్స్‌ను ప్రభుత్వం కోరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ తరహా పార్క్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కిటెక్స్‌ ప్రతినిధులతో తదుపరి చర్చల కోసం ఏపీ నుంచి నిపుణుల బృందం కొచ్చికి వెళ్లనున్నట్లు సబు జాకబ్‌ తెలిపారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు

కొచ్చిలోని కిటెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌‌లోని వినూత్న ఉత్పత్తి ప్రక్రియలు, అధునాతన సాంకేతికతను స్వయంగా పరిశీలించిన లోకేష్, సంస్థ నాణ్యతా ప్రమాణాలను కొనియాడారు. ఏపీలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా వేగవంతంగా అనుమతులు ఇస్తామని, కిటెక్స్ పెట్టుబడులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు మరియు సబ్సిడీలను వేగంగా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here