నేడు తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్

Andhra CM Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP CM YS Jagan Participate in Tirumala Srivari Brahmotsavalu, Srivari Brahmotsavalu, Tirumala, Tirumala Brahmotsavams, Tirumala Srivari Brahmotsavalu, tirumala srivari brahmotsavam 2020, Tirumala Tirupati Devasthanam, tirumala tirupati srivari brahmotsavam, Tirupati

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు పాల్గొననున్నారు. సీఎం వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని, బుధవారం నాడు నేరుగా తిరుపతికి బయల్దేరారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు గరుడసేవను పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు. సీఎం రెండు రోజుల పాటుగా తిరుమలలో పర్యటించనున్నారు.

సీఎం వైఎస్ జగన్ తిరుమల షెడ్యూల్:

  • మధ్యాహ్నం 1.00 గంటకు ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు.
  • రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహనికి చేరుకుని బస చేస్తారు.
  • సాయంత్రం 5.27 గంటలకు అన్నమయ్య భవన్‌ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొంటారు.
  • సాయంత్రం 6.15 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుండి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గరుడవాహన సేవలో పాల్గొంటారు.
  • అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.
  • రాత్రి 7.40 గంటలకు తిరిగి శ్రీ పద్మావతి అతిధి గృహనికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
  • సెప్టెంబర్ 24, గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్ర సీఎం యడియూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.
  • ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు సీఎంలు ఇద్దరూ సుందరకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • అనంతరం కర్ణాటక రాష్ట్ర ఛారిటీ సత్రాల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం యడియూరప్పతో కలిసి సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
  • ఇక తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu