ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన, కేంద్రమంత్రులతో భేటీ

AP CM YS Jagan Delhi Tour: Meet with Union Ministers Amit Shah, Gajendra Singh Shekhawat

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సెప్టెంబర్ 22, మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, శాసన మండలి రద్దు పక్రియ, దిశా చట్టం, కరోనా పరిస్థితులు సహా పలు అంశాలపై అమిత్ షా తో చర్చించినట్టు తెలుస్తుంది. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం అమిత్ షాతో మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో కీలక అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

మరోవైపు రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కూడా సీఎం వైఎస్ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ నిధులు విడుదలపై మంత్రి షెకావత్‌ తో చర్చించారు. రాష్ట్రంలో ఇతర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కూడా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పోలవరం సందర్శనకు రావాలని కేంద్ర మంత్రి షెకావత్ ను సీఎం వైఎస్ జగన్‌ కోరగా, త్వరలోనే వస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =