తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి – మంత్రి కేటీఆర్

Minister KTR Tweet About Affection Between Telangana and Andhra Pradesh, Minister KTR Tweet, Affection Between Telangana and Andhra Pradesh, Telangana and Andhra Pradesh, Telangana, Andhra Pradesh, Minister KTR Tweet About Telangana and Andhra Pradesh, Telangana and Andhra Pradesh Affection, KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, Minister of Telangana, KTR Minister of Telangana, Kalvakuntla Taraka Rama Rao, Kalvakuntla Taraka Rama Rao Tweet, Telangana Minister KTR Tweet About Affection Between Telangana and Andhra Pradesh, Telangana Minister KTR Says Affection Between Telangana and Andhra Pradesh, Mango News, Mango News Telugu, KTR Tweet About Affection Between Telangana and Andhra Pradesh,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ సోదరభావంతో మెలుగుతుంటారని ఆయన అన్నారు. హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ కుమారుడు బొత్స సందీప్ వివాహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ వేడుక‌లో మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ పాల్గొన్నారు. అనంతరం నూత‌న వ‌ధూవ‌రులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయ‌కులు శ్రీధ‌ర్ బాబు, సుద‌ర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ వివాహ వేడుకకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నాయకులు మంత్రి కేటీఆర్ తో ఆప్యాయంగా మాట్లాడారు. కొంతమంది వైసీపీ నేతలు ఆయనతో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహం చూపించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తన భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “నిన్న ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడిని వివాహ సందర్భంగా ఆశీర్వదించటానికి వెళ్లాను. అయితే, అక్కడి వారి నుంచి లభించిన ప్రేమాభిమానాలు చూసి పొంగిపోయాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినా.. మనమధ్య ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి” అని ట్విట్టర్ లో తెలిపారు మంత్రి కేటీఆర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ