కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్‌ భేటీ.. రాష్ట్ర సమస్యలపై స్పందించాలని కోరుతూ వినతిపత్రం

CM YS Jagan Mohan Reddy Meets Union Home Minister Amit Shah To Give Letter on State Issues, AP CM YS Jagan Mohan Reddy Meets Union Home Minister Amit Shah To Give Letter on State Issues, YS Jagan Mohan Reddy Meets Union Home Minister Amit Shah To Give Letter on State Issues, AP CM Meets Union Home Minister Amit Shah To Give Letter on State Issues, Letter on State Issues, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Union Home Minister, Minister Amit Shah, Amit Shah, State Issues, CM YS Jagan Delhi Tour, AP CM YS Jagan Delhi Tour, AP CM Delhi Tour, AP CM Delhi Tour News, AP CM Delhi Tour Latest News, AP CM Delhi Tour Latest Updates, AP CM Delhi Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. చర్చలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, మెడికల్‌ కాలేజీలకు సంబంధించి అనుమతులు.. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ వంటి కీలక అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి రెవెన్యూలోటు కింద రూ. 32,625 కోట్లు రావల్సి ఉందని వినతిపత్రంలో తెలిపారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. తన పర్యటనలో పర్యటనలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై చర్చ జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,467 కోట్లకు ఖరారు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్రానికి రెవెన్యూలోటు కింద రూ. 32,625 కోట్లు రావల్సి ఉందని, అలాగే రుణ పరిమితిలో 17,928 కోట్లు కోత విధించారని, దీనిని సరిదిద్దాలని ప్రధానిని కోరారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇక అమిత్‌షాతో భేటీ ముగిసిన అనంతరం సీఎం జగన్ తిరిగి విజయవాడకు బయలుదేరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + nine =