తెలంగాణలో నేటినుంచి 5వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం, పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చిన మంత్రులు

Telangana Govt Starts The Fifth Edition of Palle Pattana Pragathi Program From Today, Govt Starts The Fifth Edition of Palle Pattana Pragathi Program From Today, TS Govt Starts The Fifth Edition of Palle Pattana Pragathi Program From Today, Fifth Edition of Palle Pattana Pragathi Program From Today, Fifth Edition of Palle Pattana Pragathi Program, Palle Pattana Pragathi Program Fifth Edition, Palle Pattana Pragathi Program, Palle Pragathi Program, Pattana Pragathi Program, Palle Pattana Pragathi Program News, Palle Pattana Pragathi Program Latest News, Palle Pattana Pragathi Program Latest Updates, Palle Pattana Pragathi Program Live Updates, Fifth Edition, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతులతో పాటు అత్యుత్తమ పారిశుద్ధ్యం కల్పించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 5వ విడత కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరగనున్న ఈ ప్రగతి కార్యక్రమాల్లో పారిశుద్ధ్యంతో పాటు పచ్చదనంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు ప్రగతి పనుల్లో పాలుపంచుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు.

పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచటమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో గల సీఐబీ క్వార్టర్స్ వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తలసాని ఇంటింటికి తిరుగుతూ పట్టణ ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా బంధనపల్లి చెరువులో పూడికతీత పనులలో పాల్గొన్నారు.

ఇక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్‌లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ క్రీడప్రాంగణాన్ని ప్రారంభించి, జడ్పీ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంకోవైపు ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో పల్లె, పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ క్రమంలో ఆయన జీకే బంజార పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మెట్‌పెల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో కలెక్టర్‌తో కలిసి పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eight =