అన్ని పార్టీల టార్గెట్ వైసీపీ ఓటమేనా? పదవులు కాదా?

AP Politics ,Interesting politics, power sharing in AP politics, YCP, all parties,TDP, BJP, JANASENA, Bolishetti Satyanarayana, Vishnuvardhan Reddy, AP government, Andhra Pradesh News Updates, AP Elections, Mango News Telugu, Mango News
AP Politics ,Interesting politics, power sharing in AP politics, YCP, all parties,TDP, BJP, JANASENA, Bolishetti Satyanarayana, Vishnuvardhan Reddy

ఏపీలో పవర్ షేరింగ్‌పై హరిరామజోగయ్య ఇటీవల రాసిన లెటర్‌పై సోషల్ మీడియాలో  తెగ చర్చనడుస్తోంది. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా అధికారాన్ని కూడా పంచుకుంటారా.. లేక కేవలం సీట్లతోనే సరిపెడతారా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున  వినిపిస్తున్నాయి. ఏపీలో అధికార పక్షాన్ని ఢీకొట్టడానికి  పొత్తులు ఒకటే మార్గమని అనుకున్న  ప్రతిపక్షాలు అదే దిశగా పని చేస్తున్నాయి. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తుంది. అయితే అధికారం వచ్చాక చంద్రబాబు ఒక్కరే ముఖ్యమంత్రి పదవిలో  కూర్చుంటారా.. లేక పవన్‌ కళ్యాణ్‌తో పవర్ పంచుకుంటారా అనే  ప్రశ్నలు ఏపీలో వినిపిస్తున్నాయి.

దీనికి ఊతం ఇచ్చినట్లుగానే లోకేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. పవర్ షేరింగ్ ఉండదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో జనసేనలో పెద్ద ఎత్తున  కామెంట్లు వినిపించాయి. దీనిని తమకో అస్త్రంగా మార్చుకోవడానికి  వైసీపీ నేతలు కూడా రెడీ అయిపోయారు.

ఇదే  సమయంలో ఎప్పుడూ తన లెటర్ల ద్వారా పవన్‌కి సలహాలు, సూచనలు చేస్తూ ఉండే కాపు నేత హరిరామజోగయ్య  మరోసారి లెటర్ రాయడంపై పెద్ద ఎత్తున చర్చ  జరిగింది.  జనసేన 40-50 స్థానాల్లో పోటీ చేయాలని.. దీంతో పాటు అధికారాన్ని పంచుకుంటామని ఎన్నికలకు ముందు టీడీపీ చెప్పాలని  అప్పుడే  ఓట్ల బదిలీ జరుగుతుందని  హరిరామ జోగయ్య రాశారు.

అయితే దీనిపై స్పందించిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ  వైసీపీకి అధికారం రాకుండా చేయడమే తమ మొదటి లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆ తర్వాతే పవర్ గురించి ఆలోచిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. కర్నాటకలో జరిగినట్లు పవర్ షేరింగ్ జరగొచ్చు.. లేకపోతే సీఎం సీటు షేరింగూ జరగొచ్చంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు.  ఇదే సమయంలో  బీజేపీ శిబిరం నుంచి  దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించడం పొలిటికల్ కాకను రేపుతోంది. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమతో పవర్ షేర్ చేసుకుంటాయని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి చెప్పడం రాజకీయాలలో వేడిని పెంచేస్తున్నాయి. ఎన్నికలు ఇంకా జరగలేదు.. కానీ అప్పుడే పదవులపై ప్రతిపక్ష నేతలు లెక్కలు వేసుకుంటున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE