కామెడీ వర్సెస్ కాంట్రవర్సీ: ‘డీప్ టాక్స్ విత్ దీప్తి’ ప్రత్యేక విశ్లేషణ

ComedyvsControversy-A Special Analysis by 'Deep Talks with Deepti'

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్టాండ్-అప్ కామెడీ, రోస్ట్ కల్చర్ పేరిట వైరల్ అవుతున్న జోకులు సమాజంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కామెడీ శృతి మించుతోందా? లేదా ఆడియన్స్ అతిగా స్పందిస్తున్నారా? అనే అంశంపై Deep Talks with Deepti యూట్యూబ్ ఛానల్ ఒక లోతైన విశ్లేషణాత్మక వీడియోను అందించారు.

సోషల్ మీడియా అల్గారిథమ్స్ మరియు వ్యూస్ కోసం క్రియేటర్లు అబ్జర్వేషన్ కామెడీని వదిలి, వ్యక్తిగత దూషణలు (హ్యుమిలియేషన్), సెలబ్రిటీలపై కాంట్రవర్షియల్ కామెంట్స్ వైపు మళ్ళుతున్నారని ఈ వీడియోలో చర్చించారు. కేవలం అటెన్షన్ ఎకానమీ కోసం కంటెంట్ నాణ్యత దెబ్బతింటోందని, కాంటెక్స్ట్ లేకుండా క్లిప్‌లు వైరల్ అవ్వడం వల్ల వివాదాలు రేగుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం కమీడియన్లలో బాధ్యత, ప్రేక్షకులలో సహనం పెరగాలని, ప్రతి విషయానికి ఒక పరిమితి ఉండాలని ‘డీప్ టాక్స్ విత్ దీప్తి’ ఛానల్ ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here