ప‌వ‌న్ లేకుంటే కూట‌మి లేదు.. చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

TDP Chief Chandrababu Naidu Sensational Comments On Pawan Kalyan,Sensational Comments On Pawan Kalyan,TDP Chief Chandrababu Naidu Sensational,Chief Chandrababu Naidu,TDP Chief,Pawan Kalyan,Janasena,Lok Sabha Elections 2024,Elections Result 2024,NDA,TDP,Assembly Elections,General Election In Andhra Pradesh,AP Election Results 2024,Mango News, Mango News Telugu
chandrababu naidu, pawan kalyan, tdp, janasena

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం కూట‌మి విజ‌య‌దుందుభి మోగించింది. చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకుంది. నాటి ఎన్టీఆర్ ప్ర‌భుత్వాన్ని మించిన ఘ‌న‌త సాధించింది. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత‌, కాబోయే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు కీల‌క అంశాలు వెల్ల‌డించారు. కూట‌మికి బీజం వేసింది ప‌వ‌న్ క‌ల్యాణే అని తెలుగుదేశం నాయ‌కుడు చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలొద్ద‌ని ప‌వ‌న్ ప‌ట్టుబ‌ట్టారని, బీజేపీ కూడా త‌మ‌తో క‌లిసి వ‌చ్చింద‌ని వివ‌రించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని ప‌వ‌న్ పాటుప‌డ్డార‌ని, స‌మ‌ష్టి కృషితో విజ‌యం సాధించామ‌ని తెలిపారు. పొర‌పాట్లు లేకుండా మూడు పార్టీలూ స‌మానంగా క‌ష్ట‌ప‌డ్డామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు గెల‌వాలి.. రాష్ట్రం నిల‌బ‌డాలి.. భావిత‌రాల భ‌విష్య‌త్ కోసం పాటుప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లో ఒడిదుడుకులు స‌హ‌జ‌మ‌ని, ఎవ‌రూ శాశ్వ‌తం కాదని, దేశం, ప్ర‌జాస్వామ్యం, రాజ‌కీయ‌పార్టీలు శాశ్వ‌తం అని చంద్ర‌బాబు తెలిపారు.

అసెంబ్లీలో నాపైనా, నా కుటుంబంపైనా జ‌రిగిన అవ‌మానాన్ని భ‌రించ‌లేక‌పోయాన‌ని నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. బాంబుదాడి జ‌రిగిన‌ప్పుడు కూడా అంత‌లా బాధ‌ప‌డ‌లేద‌ని తెలిపారు. నిన్న విడుద‌లైన ఫ‌లితాల్లో తెలుగుదేశం కూట‌మి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలోబుధ‌వారం ఉద‌యం మీడియాతో మాట్లాడారు. చారిత్ర‌క విజ‌యాన్ని అందించిన‌ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కూలీ కోసం ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లిన ప్ర‌జ‌లు, అమెరికాలో ఉన్న వాళ్లు కూడా వ‌చ్చి ఓట్లు వేశార‌ని చెప్పారు. సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడ‌తాన‌ని నాటి కౌర‌వ‌స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, త‌న శ‌ప‌థం నెర‌వేర‌డానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించార‌ని తెలిపారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఈ ఐదేళ్ల‌లో ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎప్పుడూ చూడ‌లేదని అన్నారు. వ్య‌వ‌స్థ‌లు, ఎకాన‌మీ కుప్ప‌కూలాయ‌ని తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌న్నారు. తాను మిగులు విద్యుత్ తీసుకొస్తే.. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారన్నారు.

ఐదేళ్ల‌లో 30 ఏళ్ల డ్యామేజీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. అవినీతి, అరాచ‌కాల‌తో ప‌నిచేస్తే ఇలాంటి ఫ‌లితాలే వ‌స్తాయ‌ని వైసీపీ ఘోర ఓట‌మికి కార‌ణాలు తెలిపారు. ఐదేళ్లు త‌మ కార్య‌క‌ర్త‌ల క‌ళ్ల‌లో నిద్ర‌లేని ప‌రిస్థితులు తెచ్చార‌ని అన్నారు. మీడియాను కూడా ఐదేళ్లు ఇబ్బంది పెట్టార‌న్నారు. ప్ర‌శ్నించిన‌వారిపై కేసులు పెట్టారు.. ప్ర‌జాస్వామ్యం సిగ్గుతో త‌ల‌దించుకునే ప‌రిస్థితి తెచ్చారు.. అని పేర్కొన్నారు. కార్య‌క‌ర్త‌ల త్యాగాల ఫ‌లిత‌మే ఈ విజ‌యం అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు 200 సీట్లు వ‌చ్చాయ‌ని, ఇప్పుడు మ‌ళ్లీ రికార్డు సీట్లు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు. ఏపీ చ‌రిత్రలో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ నిర్ణ‌యమ‌న్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY