ఒకప్పుడు 50ఏళ్లు దాటితే కనిపించే రోగాలు..ఇప్పుడు చిన్నవయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా..రకరకాల జబ్బులతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండెజబ్బులు, షుగర్ వ్యాధితో చనిపోయేవారు లక్షల్లో ఉంటున్నారు.
నిజానికి మనం తినే ఆహారం కూడా ఈ జబ్బులు రావడానికి మెయిన్ రీజన్ అని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఈ జబ్బులతో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మూడు జబ్బులకూ కూడా పీనట్ బటర్ తో చెక్ పెట్టొచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
పెద్దప్రేగు కాన్సర్ నివారణలో పీనట్ బటర్ ఎంతగానో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. పీనట్ బటర్ అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని వెంటనే రక్షిస్తుంది. వేరుశెనగలో ఉండే విటమిన్ పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం ఇంకా ఇతర క్యాన్సర్ల నుంచి సురక్షితంగా కాపాడుతుంది.
పీనట్ బటర్ లో పి -కొమరిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే అసంతృప్త కొవ్వును కూడా కలిగి ఉంటుంది. పీనట్ బటర్ ని తినడం వల్ల కార్డియోవాస్కులర్ ఇంకా కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం బారిన పడే ఛాన్స్ అనేది ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి.
పీనట్ బటర్ లో ఐరన్ ఇంకా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన బలమైన ఇంకా దృఢమైన ఎముకలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే పీనట్ బటర్ ను రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా నియంత్రించవచ్చు. అంతేగాక ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం తెలిసిందేంటంటే..పీనట్ బటర్ ని క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం ఇంకా ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం వెంటనే తగ్గిపోతుంది.