గుంటూరులో మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్

Andhra Pradesh, Andhra Pradesh Ex-minister Devineni Uma, Andhra Pradesh Ex-minister Devineni Uma and Other TDP Leaders Arrested in Guntur, Andhra Pradesh News, Andhra Pradesh Politics, Devineni Uma, Devineni Uma Arrested, Ex-minister Devineni Uma and Other TDP Leaders Arrested, Ex-minister Devineni Uma and Other TDP Leaders Arrested in Guntur, Former TDP minister Devineni Uma arrested, Guntur, Mango News, TDP Senior Leader Devineni Uma Arrest

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఈరోజు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమయంలో దేవినేని సహా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. నిన్న అర్ధ రాత్రి టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టిడీపీ భగ్గుమంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. అశోక్ బాబును కలుసుకోవటంకోసం టీడీపీ నాయకులు బయల్దేరారు. మాజీ మంత్రి దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్ వంటి నేతలతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు వెళ్ళారు.

అయితే, సీఐడీ ఆఫీసు వద్ద పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో.. టీడీపీ నేతలు, పోలీసుల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై దేవినేని ఉమ అసహనం వ్యక్తం చేశారు. అయితే, పరిస్థితి అదుపుతప్పుతోందన్న అనుమానంతో గుంటూరు పోలీసులు వెంటనే ఉమా పాటు ఇతర నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. అర్ధరాత్రి అశోక్ బాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. అశోక్ బాబుపై అక్రమ  కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారేమో అని దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 5 =