ఉగాది పండగ నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు.. సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు

25 districts in andhra pradesh, andhra pradesh districts and mandals list, ap 25 districts map, AP CM Jagan, AP CM Jagan Orders New Districts in Andhra Pradesh To Be Formed By Ugadi Festival, AP govt begins process of formation of new districts, ap new districts list 2022, Mango News, New Andhra Pradesh districts, New Districts Formation in Andhra Pradesh, new districts in andhra pradesh 2022, New Districts in Andhra Pradesh To Be Formed By Ugadi Festival, new districts in ap latest news, newly proposed districts in andhra pradesh, Notification for 13 new Andhra Pradesh districts, Notification on 13 new districts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఉగాది పండగ నాటికి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో సంబంధిత అధికారులతో జిల్లాల పునర్విభజనపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం తీసుకోవడానికి కారణాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అదేవిధంగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలనుంచి అందుతున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, హోం మంత్రి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ మేరకు, ఆయా కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పరిపాలనను రానున్న ఉగాది పండగ నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ చెప్పారు. ఉగాది పండగ రోజు నుంచి అన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పరిపాలన కొరకు కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చేంత వరకు తాత్కాలిక భవనాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్‌ సూచించారు. ఈ క్రమంలో, స్థానిక సంస్థల విభజన విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + fifteen =