ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

Andhra Pradesh Local Body Elections, Andhra Pradesh Local Body Elections Postponed, AP Elections Postponed, AP Local Body Elections, AP Municipal Elections, AP ZPTC Elections, Coronavirus, Local Body Elections Postponed, Mango News Telugu

రోజు రోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే నామినేషన్ల పక్రియను కూడా ముగించుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఈ ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చ్ 15, ఆదివారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో కరోనా వైరస్ ప్రభావం వలన ఊహించని మార్పులు వచ్చాయని, ఈ క్రమంలో మారిన పరిస్థితుల దృష్ట్యా స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

స్థానిక ఎన్నికలను పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, దీనివల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పార్టీలు, ఉద్యోగులు, ఇతర సంబంధిత వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఊహించని పరిణామాల వలనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా పడిందని, ఆరు వారాల తర్వాత ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకున్నాక ఎన్నికలు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని, కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నట్లు తెలిపారు. మాచర్ల సీఐపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు రమేష్ కుమార్ వెల్లడించారు.

[subscribe]

Video thumbnail
CM YS Jagan About their Strategies In Review Meeting With Officials | AP Political News | Mango News
09:24
Video thumbnail
Vijayasai Reddy Interesting Comments Over AP Municipal Elections 2020 | AP Latest News | Mango News
11:21
Video thumbnail
MP Vijayasai Reddy Confident Over YCP Win In Tekkali | AP Municipal Elections 2020 | Mango News
09:29
Video thumbnail
Minister Anil Kumar Yadav Challenges Opposition Over AP Municipal Elections | AP News | Mango News
06:45
Video thumbnail
Minister Perni Nani Controversial Comments On Opposition Over Yes Bank Scam | AP News | Mango News
09:06
Video thumbnail
Minister Anil Kumar Yadav Shocking Statements Over Drunkards In AP | AP Latest News | Mango News
04:50
Video thumbnail
Vijayasai Reddy Strong Message To Public Over AP Municipal Elections 2020 | Vizianagaram | MangoNews
06:35
Video thumbnail
MP Vijayasai Reddy Excellent Speech About YS Jagan Governance In Vizianagaram Meeting | Mango News
08:58
Video thumbnail
Botsa Satyanarayana Speech Over AP Municipal Elections 2020 | Vizianagaram | AP News | Mango News
08:38
Video thumbnail
Botsa Satyanarayana Confident Over YCP Win In AP Municipal Elections 2020 | Vizianagaram | MangoNews
09:21
Video thumbnail
Pamula Pushpa Sreevani Strong Message To Public Over Local Body Elections 2020 | AP News | MangoNews
05:06
Video thumbnail
CM YS Jagan Addresses Media For First Time About Municipal Elections | AP Latest News | Mango News
06:13
Video thumbnail
Botsa Satyanarayana Speaks About Jagan's Decision Over Municipal Elections | AP News | Mango News
10:30
Video thumbnail
Botsa Satyanarayana Says AP Municipal Elections Has To Be Held Before 2 Months | AP News | MangoNews
12:25
Video thumbnail
Botsa Satyanarayana Strong Warning Over Distribution Of Liquor & Money In Elections | Mango News
06:26

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 5 =