పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపు విషయాలపై సీఎం జగన్ కు సోము వీర్రాజు బహిరంగ లేఖ

AP BJP President Somu Veerraju Writes to CM Jagan Over to Release White Paper on Land Allotment to Industries,AP BJP President Somu Veerraju,Somu Veerraju Writes to CM,CM Jagan,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం బహిరంగ లేఖ రాశారు. విభజనాంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా భూముల కేటాయింపులు జరిపిన విషయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. “ప్రభుత్వం భూములు కేటాయించిన తరువాత పరిశ్రమలు ఎందుకు ప్రారంభం జరగలేదు అన్న విషయాలపై పాలక ప్రభుత్వం ఏనాడైనా సమీక్ష జరిపిందా, ఆవిషయాలు రాష్ట్రప్రజలకు ఎందుకు వివరించడం లేదన్నదే అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ప్రభుత్వం భూములు కేటాయించిన తరువాత పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలు భూముల వద్దకు వెళితే కబ్జాకు గురైన సంఘటనలు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి. ఈ కారణంగా అధికార పార్టీ నేతలు ఈ తరహా కబ్జాలకు పాల్పడుతున్న పరిస్థితిలు కూడా వినవస్తున్నాయి. పలు సంస్థలు ఈ కారణంగానే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వెనక్కి వెళుతున్నట్లు లేఖలు ప్రభుత్వానికి ఇస్తున్నాయి. ఈ తరహా అనుమానాలకు సమాధానం ప్రజలకు అందించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందని అందువల్ల శ్వేత పత్రం విడుదల చేయాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను” అని సోము వీర్రాజు అన్నారు.

“పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కేంద్రప్రభుత్వం కారిడార్ లను ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు సిద్దం కావాలని, అప్పడు మాత్రమే విభజనాంధ్రప్రదేశ్ కు మోక్షం కలుగుతుంది. నాలేఖ కు సమాధానం చెప్పడం ద్వారా ప్రభుత్వ వైఖరి అర్ధం కావాలన్న భాద్యతతో బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పరిశ్రమలు సంస్థలు, జాతీయ రహదారి నిర్మాణము, రైల్వే లైన్ నిర్మాణాలు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల అమలు జరుగుతున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఆయా కాంట్రాక్టర్ల కార్యక్రమాలకు అడ్డుపడటం అధికార దుర్వినియోగం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేయటము వారి నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మీ ప్రభుత్వం అడ్డుపడుతుందని అనేకమైనటువంటి ఉదాహరణలు బయటకు వస్తున్నాయి. జాకీ సంస్థ పరిశ్రమ ఏర్పాటు కాకుండా ఎందుకు వెనుదిరుగుతోంది?, దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అదే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలియాచేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక మాంద్యం నుండి గట్టెక్కించాలంటే పరిశ్రమల ఏర్పాటు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను” అని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here