ఐటీ, ఈడీ దాడులకు భయపడేది లేదు, ఇవి ముందే ఊహించాం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Telangana Minister Talasani Srinivas Yadav Responds Over IT Raids on Minister Mallareddy,IT Raids on Minister Mallareddy,Telangana Minister Talasani Srinivas Yadav,Trs Minister Malla Reddy,Trs Minister Malla Reddy,Mango News,Mango News Telugu,Malla Reddy It Raids,It Raids On Malla Reddy And His Kin,Income Tax Department,Telangana It Dept Raids,Telangana It Raid On Minister Malla Reddy,Malla Reddy It Raids ,It Raids Latest News And Updates

తెలంగాణలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడులకు భయపడేది లేదని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని, అయితే బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని మంత్రి తలసాని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో దాడులు జరగొచ్చని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని, తాము ముందే ఊహించామని కూడా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇక ఐటీ, ఈడీ దాడులు సాధారణంగా జరుగుతుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయితే తెలంగాణలో లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని, భయపడితే హైదరాబాద్ లో ఉండలేమని అన్నారు. అయినా ఎవ్వరికీ అధికారం శాశ్వతం కాదని, ఈరోజు మీరు ఉన్నారు.. రేపు అధికారం మారినప్పుడు ఇదే సంప్రదాయం కొనసాగుతుందని మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. ఇక ఈ దాడుల అంశాన్ని ప్రజలలోకి తీసుకెళ్తామని, బీజేపీ నైజాన్ని బయటపెడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here