పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా.. ముస్లింలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు

CM YS Jagan Wishes All Muslims on The Occasion of Beginning of Holy Month Ramadan,CM YS Jagan Wishes All Muslims,Beginning of Holy Month Ramadan,Muslims on The Occasion of Ramadan,Holy Month Ramadan,Mango News,Mango News Telugu,YS Jagan wishes Muslims,YS Jagan conveys wishes to Muslims,YS Jagan Mohan Reddy Extend Ramadan Wishes,AP CM YS Jagan Mohan Reddy,CM YS Jagan Latest News,CM YS Jagan Latest Updates,Holy Month Ramadan Latest Updates,Holy Month Ramadan Latest News

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంవో గురువారం సీఎం జగన్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ మాసంలో పవిత్ర ఖురాన్ ప్రవక్త మహమ్మద్ ద్వారా అవతరింపబడిందని, ముస్లింలు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటించి అల్లా ఆశీస్సులు పొందుతారని ఆయన అన్నారు. అలాగే క్రమశిక్షణ, ధార్మికత, ధార్మిక చింతనల మేళవింపు జీవితమనే గొప్ప సందేశాన్ని రంజాన్ మాసం అందిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాలకు వెచ్చిస్తున్నారని, కఠిన ఉపవాస దీక్షలు (రోజా) పాటిస్తూ భగవంతుని సన్నిధానంలో గడుపుతారని ఆయన తెలిపారు. మనిషిలోని చెడు భావాలు, అన్యాయం, ద్వేషాలను రూపుమాపి మానవాళికి కల్యాణాన్ని బోధించే పండుగ రంజాన్ అని నిర్వచించిన సీఎం జగన్, ఈ నెల ప్రారంభం సందర్భంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =