ఈనెల 27న నెల్లూరులో జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌ 3వ యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

AP CM Jagan To Launches 3rd Unit of Genco Thermal Plant in Muthukur Nellore on Oct 27, AP CM YS Jagan Mohan Reddy, Genco Thermal Plant Opening, Genco Thermal Plant in Muthukur, Mango News, Mango News Telugu, Genco Thermal Plant Nellore, Nellore Genco Thermal Plant, Jagan To Launches 3rd Unit of Genco Thermal Plant, Nellore Thermal Plant Opening Nellore, Nellore Thermal Plant Opening, Genco Thermal Plant Latest News And Updates, 3rd Unit of Genco Thermal Plant, Nellore Thermal Plant

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ముత్తుకూరు మండలం జెన్‌కో థర్మల్‌ ప్లాంట్‌లోని మూడో యూనిట్‌ను ప్రారంభించనున్నారు. కాగా ఈ యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మత్స్యకారులేతర ప్యాకేజీని బాధిత గ్రామాల్లోని గ్రామస్థులకు అందజేయనున్నారు. బహిరంగ సభ జరిగే వేదిక, పార్కింగ్‌ స్థలాలు, హెలిప్యాడ్‌, పైలాన్‌, ప్లాంట్‌ మూడో యూనిట్‌ను మంత్రి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.

2019 ఏప్రిల్ నాటికి తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న ముత్తుకూరు మండల గ్రామస్తులకు మత్స్యకారులేతర ప్యాకేజీ అందుతుందని, లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేశామని మంత్రి కాకాణి పేర్కొన్నారు. 2019కి ముందు కొంతమందికి రూ.14 వేల ప్యాకేజీ అందిందని, మిగిలిన మొత్తాన్ని ప్యాకేజీలో భాగంగా అందజేస్తామని చెప్పారు. డబ్బులు అందకుంటే అధికారులను సంప్రదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పటికే 1,600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సీఎం జగన్ ప్రారంభించనున్న మూడో యూనిట్‌ తర్వాత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,400 మెగావాట్లకు పెరుగుతుందని మంత్రి కాకాణి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =