పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ

Ambati Rayudu, Janasena, Janasenani Pawan kalyan, AP Politics
Ambati Rayudu, Janasena, Janasenani Pawan kalyan, AP Politics

అంబటి రాయుడు.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా మారుమ్రోగుతున్న పేరు. ఇటీవల వైసీపీలో చేరి పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అంబటి. ఏమయిందో ఏమో కానీ పట్టుమని పది రోజులు కూడా కాకముందే సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి గుడ్ బై చేప్పేస్తున్నట్లు ప్రకటించేశారు. దీంతో ఏమయింది?.. ఎందుకు అంబటి రాయుడు రాజీనామా చేశారు?.. అనే అంశాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దుబాయ్‌లో జరగబోతున్న ఐఎల్‌టి-20లో ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అంబటి క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఒక్కసారి అంబటి రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎదుట ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. వైసీపీలోకి బయటికొచ్చాక కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానన్న అంబటి.. వారం రోజులు కూడా కాకముందే పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావడం రాజకీయంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది. జనసేనలో  చేరేందుకే పవన్ కళ్యాణ్‌తో అంబటి రాయుడు సమావేశమయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే అంబటి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏపీ ఓటర్లలో కాపు సామాజిక వర్గానిదే పై చేయి. దాదాపు 23 శాతం ఓటర్లు వారే ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ కాపులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలో అంబటి రాయుడు జనసేనకు దగ్గరయ్యారని తెలుస్తోంది. అలాగే జనసేన అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమయినప్పటికీ త్వరలోనే అంబటి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని అంబటి ప్రకటించడంతో నిరాశకు గురైన అభిమానులు.. తిరిగి జనసేనానితో కలవడంతో ఖుషీ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =