కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్ గా మెకల్లమ్‌

Kolkata Knight Riders Appoint Brendon McCullum As Head Coach,Mango News,Kolkata Knight Riders Latest News,Brendon McCullum appointed Kolkata Knight Riders head coach,Kolkata Knight Riders Appoint Brendon McCullum as Coach,IPL - Kolkata Knight Riders Appoint Brendon McCullum as Coach

న్యూజిలాండ్ జట్టు మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన కొత్త హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి సంబంధించిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కు (టికెఆర్) కూడ మెకల్లమ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. గత ఐపీఎల్ సీజన్లో జట్టు ఆశించినంతగా రాణించక పోవడంతో హెడ్ కోచ్‌ జాక్వెస్ కలిస్ ను కేకేఆర్ యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పంచింది.

2020 ఐపీఎల్ సీజన్ నుంచి బ్రెండన్ మెకల్లమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్ గా బాధ్యతలు చేపడతాడు. 2008 నుండి 2010 వరకు మరియు 2012-2013 సీజన్లలో మెకల్లమ్‌ నైట్‌రైడర్స్‌ తరుపున ఆడాడు. 2008 లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లోనే మెకల్లమ్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి ఐపీఎల్ లో తోలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్ గా కూడ వ్యవరించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి, ప్రైవేట్ టి-20 లీగుల్లో కొంతకాలం కొనసాగాడు. ఇటీవలే గ్లోబల్ టి-20లో ఆడిన మెకల్లమ్‌ ఇక ఆటకు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ఇచ్చి కోచ్ గా కొనసాగనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here