తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల

Aarogyasri Services Stopped In Telangana,Telangana - Health Minister Calls For A Meeting At 3PM,Mango News,Telangana Political News,Telangana Latest New Live Updates,Protesting Hyd junior docs call off strike after meeting with Health Minister,Aarogyasri dues stir - Health Minister calls for talks at 3pm today,Telangana Junior Doctors Association calls off strike after meeting Health Minister Eatela

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లింపుల విషయంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు ఆందోళనకు దిగాయి. ఆగస్టు 16, శుక్రవారం నుంచి తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. సుమారు 240 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు ఆగిపోయాయి. ఈ పథకానికి సంబంధించిన బిల్లుల కోసం ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సంఘం ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్నీ సంప్రదించినా స్పందించక పోవడంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించేవరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.

అయితే తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలతో సమావేశం  కానున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ముందు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు నాలుగు డిమాండ్లను పెడుతున్నట్టు సమాచారం. వెంటనే రూ. 1,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని, ప్యాకేజి రేట్లు సవరించాలని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

 

[subscribe]
[youtube_video videoid=hgaFDnEnsXA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =