తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతా మోహన్ పేరు ప్రకటన

Chinta Mohan as Party Candidate for Tirupati By-election, Chinta Mohan as Party Candidate for Tirupati By-election For Congress, Chinta Mohan launches campaign for Tirupati LS byelection, Congress announces candidates for LS by-elections, Congress announces candidates for Tirupati By-election, Congress High Command Declared Chinta Mohan, Congress officially declares Dr Chinta Mohan, Mango News, Tirupati By Election, Tirupati Lok Sabha By-election, YSR Congress confident of winning Tirupati Lok Sabha seat

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించారు. చింతా మోహన్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్టుగా ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ శుక్రవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎం.గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తున్నారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు కీలక పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో తిరుపతిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నిక షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – మార్చి 23
  • నామినేషన్లకు ఆఖరితేదీ – మార్చి 30
  • నామినేషన్ల పరిశీలన – మార్చి 31
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఏప్రిల్ 3
  • పోలింగ్ జరిగే తేదీ – ఏప్రిల్ 17
  • ఓట్ల లెక్కింపు – మే 2
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + sixteen =