కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం, ఈసారి అక్కడ భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తాను – సీఎం జగన్‌

AP CM YS Jagan Mohan Reddy Interacts with YSRCP Activists From Kuppam Assembly Constituency, AP CM YS Jagan Interacts with YSRCP Activists From Kuppam Assembly Constituency, AP CM Interacts with YSRCP Activists From Kuppam Assembly Constituency, YS Jagan Mohan Reddy Interacts with YSRCP Activists From Kuppam Assembly Constituency, YS Jagan Interacts with YSRCP Activists From Kuppam Assembly Constituency, YSRCP Activists From Kuppam Assembly Constituency, Kuppam Assembly Constituency YSRCP Activists, Kuppam Assembly Constituency, YSRCP Activists Kuppam Assembly Constituency YSRCP Activists News, Kuppam Assembly Constituency YSRCP Activists Latest News, Kuppam Assembly Constituency YSRCP Activists Latest Updates, Kuppam Assembly Constituency YSRCP Activists Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మూడేళ్లుగా భరత్‌ అక్కడ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడని, భరత్‌కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని రండి అని కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా ఈసారి అక్కడ భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. కాగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు గెలిచి తీరాలనే లక్ష్యంతో ఉన్న ఆయన ఈ మేరకు ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా తన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ముందుగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై దృష్టి సారించిన ఆయన అక్కడి కార్యకర్తలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానమని, గత సీఎంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి కంటే కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. అక్కడి అభ్యర్థి భరత్‌ అడగడంతో వచ్చే రెండు రోజుల్లో కుప్పం మునిసిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇక ఈసారి కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన ఆయన, వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని పేర్కొన్నారు. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, దీనికి ఉదాహరణే ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆ నియోజకవర్గంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసిందని అని గుర్తు చేశారు. ఈ మేరకు పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nine =