రైతు భరోసా కేంద్రాలు-పౌరసరఫరాల శాఖ అనుసంధానంపై సీఎం జగన్ సమీక్ష, పలు కీలక నిర్ణయాలు

AP CM YS Jagan Mohan Reddy Held Review on Rythu Bharosa Centres Link with Civil Supplies Department, CM YS Jagan Mohan Reddy Held Review on Rythu Bharosa Centres Link with Civil Supplies Department, AP CM YS Jagan Held Review on Rythu Bharosa Centres Link with Civil Supplies Department, AP CM Held Review on Rythu Bharosa Centres Link with Civil Supplies Department, Review Meet on Rythu Bharosa Centres Link with Civil Supplies Department, Review on Rythu Bharosa Centres Link with Civil Supplies Department, Rythu Bharosa Centres Link with Civil Supplies Department, Civil Supplies Department, Rythu Bharosa Centres, connecting Rythu Bharosa Kendras with Civil Supplies Department, Rythu Bharosa Kendras, Rythu Bharosa Centres News, Rythu Bharosa Centres Latest News, Rythu Bharosa Centres Latest Updates, Rythu Bharosa Centres Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల)ను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై సమీక్ష చేపట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మరియు పొరసరఫరాల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సివిల్ సప్లై కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, సివిల్ సప్లై కార్పొరేషన్‌ వీసీ అండ్ ఎండీ వీర పాండ్యన్, ఇంకా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు కీలక సూచనలు చేశారు.

  • ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో చేసుకోవాలని ఆదేశం.
  • దీనికోసం సమర్థవంతమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచన.
  • అలాగే తరుచుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశం.
  • ఇంకా రైతులకు ఆయా భూములకు తగిన విధంగా ఎరువులు, పంటలసాగుపై ఉపయుక్తమైన సలహాలు అందించాలని సూచన.
  • ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లభించేలా చూడాలని ఆదేశం.
  • రైతులకు ఎంఎస్‌పీ ధర అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ధాన్యం కొనుగోళ్లలో అసలు మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here