ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు

AP CM YS Jagan Mohan Reddy Meets Several Central Ministers in Delhi Tour, AP CM YS Jagan Meets Several Central Ministers in Delhi, YS Jagan Mohan Reddy Meets Several Central Ministers in Delhi Tour, AP CM YS Jagan Mohan Reddy Delhi Tour, AP CM YS Jagan Mohan Reddy met three central ministers in Delhi Tour, CM YS Jagan Mohan Reddy meets Nitin Gadkari, Central Ministers, AP CM YS Jagan Delhi Tour, AP CM YS Jagan to visit Delhi, YS Jagan to visit Delhi, AP CM to meet PM Modi, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తదితర అంశాలను ప్రధానికి వివరించారు. ముఖ్యమంత్రి చెప్పిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిసింది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రుణాలపై ఆర్థిక మంత్రితో చర్చించారు. ఈ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చించారు. 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిర్మాణం, డిజైన్ల ఆమోదంపై చర్చించారు. కాఫర్‌ డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ డిజైన్లకు ఇప్పటికే జలశక్తిశాఖ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్‌ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై మరియు కొత్తగా మరికొన్ని రహదారుల నిర్మాణానికి సంబంధించిన రూట్ మ్యాప్ లపై చర్చించారు. అనంతరం మరికొందరు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eight =