పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం.. గోదావరి వరదల నేపథ్యంలో క్షేత్ర స్థాయి తనిఖీ

AP CWC Committee Visits Polavaram and Inspects Upper Coffer Dam During Heavy Floods Hit at The Project, AP CWC Committee Inspects Upper Coffer Dam During Heavy Floods Hit at The Project, AP CWC Committee Visits Polavaram Project, Heavy Floods Hit at Polavaram Project, Upper Coffer Dam, Polavaram Project, AP CWC Committee, upper coffer dam spillway of the Polavaram project, AP Central Water Commission Committee, Polavaram project upper coffer dam spillway, Polavaram Project News, Polavaram Project Latest News, Polavaram Project Latest Updates, Polavaram Project Live Updates, Mango News, Mango News Telugu,

గోదావరి వరదల తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం బృందం ఆదివారం సందర్శించింది. ఖయ్యామ్ మహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ స్పిల్ వే దిగువ ప్రాంతాలను పరిశీలించింది. ఈ క్రమంలో కాఫర్ డ్యాం ఎత్తుకి సంబంధించిన పనులను మ్యాప్‌ల ద్వారా పరిశీలించిన బృందం సభ్యులకు ప్రాజెక్టు పరిస్థితి, జరుగుతున్న పనుల వివరాలను అధికారులు వివరించారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టిన పనులను పరిశీలించి స్పిల్‌ వే గేట్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.

అనంతరం పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటవల వచ్చిన భారీ వరదల నేపథ్యంలో.. కాఫర్‌ డ్యామ్‌ భద్రతలో పాటిస్తున్న ప్రమాణాలు, స్పిల్‌ వే గేట్ల పనితీరు, డయాఫ్రమ్‌ వాల్‌ రక్షణ చర్యలు వంటి వాటిపై పోలవరం ప్రాజెక్టు అధికారులు కీలక వివరాలను బృందానికి తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును ఒక మీటర్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై ఆరా తీసింది. ఇక వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టాక మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులకు సీడబ్ల్యూసీ బృందం సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =