హ‌నుమ‌కొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ ష‌ర్మిల‌

Hunger Strike Of YS Sharmila, Mango News, Nirudyoga Nirahara Deeksha, Sharmila held 3 KM Padayatra at Hanamkonda, YS Sharmila, YS Sharmila 3 KM Padayatra, YS Sharmila held 3 KM Padayatra, YS Sharmila held 3 KM Padayatra at Hanamkonda on Part of Nirudyoga Nirahara Deeksha, YS Sharmila Latest News, YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila Nirudyoga Nirahara Deeksha

నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 14న ఉమ్మడి వరంగల్ జిల్లా, హ‌నుమ‌కొండ నగరంలోని హయగ్రీవచారీ గ్రౌండ్ ఎదురుగా వైఎస్ షర్మిల “నిరుద్యోగ నిరాహార దీక్ష“ చేపట్టారు.

ముందుగా మంగళవారం ఉదయం వైఎస్ షర్మిల హ‌నుమ‌కొండ‌ ప‌ట్ట‌ణానికి చేరుకున్నారు. కాక‌తీయ యూనివ‌ర్స‌టీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి వైఎస్ ష‌ర్మిల పూల‌మాల వేసి, నివాళి అర్పించారు. అనంత‌రం దీక్ష స్థ‌లం వ‌ర‌కు దాదాపు మూడు కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ పాద‌యాత్ర‌లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైఎస్ఆర్ అభిమానులు, నిరుద్యోగులు పెద్దఎత్తున పాల్గొని వైఎస్ షర్మిలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ పాద‌యాత్రను నిరాహార దీక్ష స్థ‌లం అయిన హ‌య‌గ్రీవ‌చారి గ్రౌండ్ వ‌ర‌కు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =