జూలై నెలలో రూ.1,48,995 కోట్ల జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయం

Rs 148995 Cr Gross GST Revenue Collected in July 2022 Second Highest Since Introduction of GST, Second Highest Since Introduction of GST, Rs 148995 Cr Gross GST Revenue Collected in July 2022, July 2022 Rs 148995 Cr Gross GST Revenue Collected, Rs 148995 Cr Gross GST Revenue Collected, GST Collections in July Jump 28%, gross GST revenue collected in July 2022, GST Revenue collection, Second Highest GST Revenue collection, Goods and Services Tax Revenue collection, GST Revenue collection July 2022 News, GST Revenue collection July 2022 Latest News, GST Revenue collection July 2022 Latest Updates, GST Revenue collection July 2022 Live Updates, Goods and Services Tax, July 2022 Goods and Services Tax, 148995 Crores, Mango News, Mango News Telugu,

దేశంలో జూలై నెలలో రూ.1,48,995 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయమని తెలిపారు. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వరుసగా రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జీఎస్టీ వసూళ్ల సేకరణ జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు జూలై 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు జూలై 2021 కంటే 28% ఎక్కువని పేర్కొన్నారు. జూలై నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 48% ఎక్కువగా ఉన్నాయని మరియు దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 22% ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

జూలైలో సీజీఎస్టీ వసూళ్లు రూ. 25,751 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.32,807 కోట్లు, ఐజీఎస్టీ రూ.79,518 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.41,420 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,920కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.995 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.32,365 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.26,774 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత జూలై 2022 నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.58,116 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.59,581 కోట్లుగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జూలై జీఎస్టీ వసూళ్లు (రూ.2,730 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది జూలైలో (రూ.3,409 కోట్లు) 25 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2022 జూలైలో రూ.3,610 కోట్లు వసూలు కాగా, 2022 జూలైలో 26 శాతం పెరుగుదలతో రూ.4,547 కోట్లు వసూలు అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =