ఐపీఎల్-2022 మిగిలిన సీజన్‌ కు రవీంద్ర జడేజా ఔట్, సీఎస్కే యాజమాన్యం ప్రకటన

IPL-2022 Chennai Super Kings Announces Ravindra Jadeja will be Missing Rest of IPL due to Injury, Chennai Super Kings Announces Ravindra Jadeja will be Missing Rest of IPL due to Injury, Ravindra Jadeja will be Missing Rest of IPL due to Injury, Chennai Super Kings Announces Ravindra Jadeja will be Missing Rest of IPL, CSK Announces Ravindra Jadeja will be Missing Rest of IPL due to Injury, Ravindra Jadeja will be Missing Rest of IPL 2022 due to Injury, Chennai Super Kings, CSK, Ravindra Jadeja, Jadeja, IPL-2022, 2022 IPL, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లో మిగిలిన మ్యాచులకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండడని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. “రవీంద్ర జడేజా పక్కటెముకకు గాయమైంది. గత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ కు జడేజా అందుబాటులో లేడు. అతను ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాడు మరియు వైద్యుల సలహా మేరకు జడేజా మిగిలిన ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు” అని అని ప్రకటించారు. 2012 నుంచి సీఎస్కే జట్టులో రవీంద్ర జడేజా కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే జడేజా నాయకత్వంలో ఈ సీజన్ లో 8 మ్యాచులు ఆడిన సీఎస్కే జట్టు, రెండు విజయాలు సాధించగా, ఆరు మ్యాచుల్లో పరాజయం పాలయింది. అనంతరం సీఎస్కే జట్టు కెప్టెన్సీని రవీంద్ర జడేజా తిరిగి ఎంఎస్ ధోనికే అప్పగించాడు. ఈ క్రమంలో తాజాగా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజన్‌కు జడేజా దూరమయ్యాడని యాజమాన్యం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here