అసెంబ్లీలో రాజధాని రైతులకు హామీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Govt Announced Special Guarantees To Amaravati Farmers, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, Mango News Telugu, Special Guarantees To Amaravati Farmers

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించిస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతి గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, వారికి తమ ప్రభుత్వం మేలు చేస్తుందని ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంతకంటే మిన్నగా అమలుచేస్తామని చెప్పారు.

అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు:

  • రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు
  • భూములిచ్చిన పట్టా రైతులకు సమానంగా అసైన్డ్ భూముల రైతులకు రిటర్న్‌ ప్లాట్లు కేటాయింపు
  • 10 ఏళ్ల పాటు జరీబు భూములకు రూ.50 వేలు, మెట్ట భూములకు 30 వేలు ఇవ్వాలని నిర్ణయం
  • ప్రతి సంవత్సరం జరీబు భూమికి రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ యాన్యునిటీని 10 నుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం
  • భూములిచ్చిన రైతుల కౌలు రూ. 5 వేలకు పెంపు, అలాగే 15 ఏళ్ల వరకు కౌలు ఇవ్వాలని నిర్ణయం
  • భూములిచ్చిన పట్టా రైతులకు 1000 గజాలు నివాసస్థలం, 250 గజాలు వాణిజ్య స్థలం
  • అసైన్డ్ భూముల రైతులకు 1000 గజాల నివాసస్థలం, 200 గజాల వాణిజ్య స్థలం.
  • గత ప్రభుత్వం ప్రకటించిన విధంగా బాండ్లు, అగ్రిమెంట్లు, ప్రతిహామీ అమలు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 6 =