స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం

Producer Allu Aravind Received Champions of Change 2019 Award, Bharat Ratna Shri Pranab Mukherjee,Mango News,Tollywood Celebrities News 2020,Champions of Change 2019,Iconic Film Producer Allu Aravind,Allu Arvind Receives Rare Honour

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. జనవరి 20, సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019’ అనే అవార్డుతో సత్కరించారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న పురస్కార గ్రహీత ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు అందించారు. సామాజిక అభివృద్ధి, మరియు సంఘ సేవ చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పలు రంగాలకు చెందిన ప్రముఖులకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకి చేసిన సేవలు, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను నిర్మాత అల్లు అరవింద్‌ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అల్లు అరవింద్ సినీ పరిశ్రమకు అందించారు. అవార్డు అందుకున్న అల్లు అరవింద్‌ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, ‘చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌’ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. 40ఏళ్ల ప్రయాణంలో జ్ఞాపకాలకు గుర్తుచేసేలా ఈ అవార్డులు ఉపయోగపడతాయని అన్నారు. సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ లో రక్తదానం చేస్తున్న రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నానని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో సమాజఅభివృధ్ధి కోసం తన సేవలను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here