ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

AP 10 Class Exams, AP 10th Class Exam 2020, AP 10th Class Examinations, AP 10th Class Exams, AP Govt Cancels 10th Class Exams, AP Govt Cancels 10th Exams, AP SSC Exams, AP SSC Exams 2020, AP SSC Exams Updates, AP SSC Time Table 2020, AP SSC-2020 Exams, AP Tenth Class Exams

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పదోతరగతి చదివిన విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 6,30,804 మంది పదో తరగతి విద్యార్థులు ప్రమోట్ అయినట్టు అవుతుంది. ముందుగా పదో తరగతి పరీక్షలను 6 పేపర్లకు కుదించి జూలై 10 వ తేదీ నుంచి జూలై 15 వరకు నిర్వహించాలని భావించారు.

అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. అలాగే పదో తరగతి పరీక్షలతో పాటు, రాష్ట్రంలో త్వరలో జరగాల్సిన ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరంలో ఫెయిలైనవారు కూడా పాస్‌ అయినట్లేనని తెలిపారు. ఇప్పటికే సప్లమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించిన విద్యార్థులకు వాపసు చేస్తామని మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − six =