ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులంతా పాస్

AP Govt Cancelled Open School Tenth and Inter Exams, AP Open School declares all SSC & Inter students pass, AP Open School Exam Cancel, AP Open School Exam Cancel 2021, AP Open school SSC Inter students declared passed, Mango News, Open school SSC Inter students declared passed, Open school SSC Inter students declared passed in Andhra, Open school SSC Inter students declared passed In AP, Open School Tenth and Inter Exams

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలను, ఇంటర్‌ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ విద్యార్థుల విషయంలో కూడా ఏపీ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గానూ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2021 జూలైలో ఈ పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించి, నమోదు చేసుకున్న విద్యార్థులందరిని పాస్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు లాగానే ఓపెన్ స్కూల్ విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు చేస్తునట్టు పేర్కొన్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పోర్టల్ లో అందుబాటులో ఉన్న వివరాల బట్టి గ్రేడ్ పాయింట్లు కేటాయించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =