ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీని డా. వైఎస్సార్ వర్సిటీగా పేరు మార్పు, నేడు సభలో బిల్లు

AP Govt Decides To Change NTR Health University as Dr YSR Varsity Amendment Bill To Introduce in Assembly Today, NTR Health University, Dr YSR Varsity , AP Govt Amendment Bill , AP Govt To Introduce Amendment in Assembly Today, NTR Health University To Dr YSR Varsity, Mango News, Mango News Telugu, AP Former CM YS Rajashekar Reddy, Former CM Nandamuri Taraka Rama Rao, YSR Congress Party, Telugu Desham Party, AP Assembly Sessions

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు దశాబ్దాలకు పైగా వైద్యవిద్యను అందిస్తున్న విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చటానికి నిర్ణయించుకుంది. దీనిని డా. వైఎస్సార్ వర్సిటీగా పేరు మార్చనున్నారు. ఈ మేరకు బుధవారం సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో సమావేశమైన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. వర్సిటీ పేరు మార్పుపై వైద్యశాఖ మంత్రి విడదల రజనీ సవరణ బిల్లును నేడు అసెంబ్లీలో పెట్టనున్నారు. కాగా విజయవాడలోని ఈ వైద్య వర్సిటీతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. వర్సిటీ ఏర్పాటులో ఆయన చాలా కృషి చేశారు.

ఈ యూనివ‌ర్సిటీ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని, నిధులు కూడా మంజూరు చేశారు. ఎన్టీఆర్‌ చూపిన చొరవకు గుర్తింపుగా మరణానంతరం తర్వాత అప్పటి ప్రభుత్వం వర్సిటీకి ఆయన పేరే పెట్టారు. దాదాపు పాతికేళ్ల పాటు ఇదే పేరుతొ కొనసాగిన ఈ యూనివర్సిటీ పేరును ఇప్పుడు అకస్మాత్తుగా మార్చడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దీనిపై శాసనసభలో నిరసన తెలిపింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో టీడీపీ సభ్యుల అభ్యంతరం తెలుపుతున్నారు. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్‌ అని, దీనిలో వైఎస్సార్ పాత్ర శూన్యం అని టీడీపీ సభ్యులు వాదిస్తున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 5 =