ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనే కోరుకుంటా

#Narasimhan, Andhra Pradesh Government Felicitated Governor Narasimhan, Andhra Pradesh Govt Felicitated Governor Narasimhan in Vijayawada, AP govt bids farewell to outgoing Governor Narasimhan, AP Govt Felicitated Governor Narasimhan in Vijayawada, Jagan Ministers fete Governor E S L Narasimhan, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 24 వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగింది, ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతీ, మరియు పలువురు ఉన్నత పభుత్వాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను వదిలి వెళ్తున్నందుకు బావోద్వేగంగా ఉందన్నారు,ఈ రాష్ట్రంతో ఎంతో అనుబంధం ఉందని, 1951లో విజయవాడలోనే అక్షరాభ్యాసం జరిగిందని, అప్పుడు గవర్నర్ పేట్ ప్రాంతంలో ఉండేవాళ్లమని గవర్నర్ గతాన్ని గుర్తుచేసుకున్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉండడం సంతోషం కలిగిందని పేర్కొన్నారు, ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనే కోరుకుంటానని చెప్పారు, తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే మన్నించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ను కుమారుడిగా భావిస్తున్నానని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.

తరువాత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తనను తండ్రిలా ఆదరించారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ దంపతులు, ప్రభుత్వం తరుపున గవర్నర్ నరసింహన్, విమల దంపతులను సత్కరించి వారికీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల సంఘ సభ్యులు, ఇతర ప్రభుత్వాధికారులు గవర్నర్ ను సత్కరించారు.

 

[subscribe]
[youtube_video videoid=Di5gm1jEzMQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =