బిగ్ బాస్-3 ఎపిసోడ్-2 హైలైట్స్ – ఆరుగురిని నామినేట్ చేసిన బిగ్ బాస్

#BiggBossSeason3, Bigg Boss 3 Telugu Episode 2 Highlight Points, Bigg Boss Season 3 Telugu Episode-2 Highlights, Bigg Boss Telugu Season 3 Episode 2 Highlights, Bigg Boss Telugu Season 3 Latest News, Mango News

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. మొదటి సీజన్ కి జూ.ఎన్టీఆర్, రెండవ సీజన్ కి నాని వ్యాఖ్యాతలుగా చేయగా, ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు.జులై 22 న ప్రసారమైన బిగ్ బాస్ 3 రెండవ ఎపిసోడ్ కూడ ఆసక్తికరంగా సాగింది.

ఎపిసోడ్ 2 (జూలై22) హైలైట్స్:

 • సీజన్ 2 లో ఎపిసోడ్స్ గంటన్నర ప్రసారమవ్వగా, ఇప్పుడు 9:30 నుంచి 10:30 వరకు గంట మాత్రమే ప్రసారమవ్వడం విశేషం.
 • బిగ్ బాస్ ఇంటిలోకి వచ్చిన వరుణ్ సందేశ్, వితికాలను, ముందుగా ఇంటిలోకి వచ్చిన ముగ్గురు సభ్యులు తీన్మార్ సావిత్రి(శివజ్యోతి), అషురెడ్డి, రవికృష్ణ ప్రశ్నలు అడగడంతో షో మొదలవుతుంది
 • సరైన సమాధానాలు చెప్పని సభ్యుల పేర్లు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించంగా తీన్మార్ సావిత్రి, అషురెడ్డి, రవికృష్ణ లు ఆలోచించి రాహుల్,జాఫర్, వరుణ్ సందేశ్, వితికా, శ్రీముఖీ, బాబాబాస్కర్ పేర్లు చెబుతారు
 • ఊహించని విధంగా వారు చెప్పిన సభ్యులను నామినేట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటన
 • వచ్చిరాగానే నామినేట్ అవ్వడంపై సభ్యుల మధ్య చర్చ
 • మరుసటి ఉదయం బాబాభాస్కర్, జాఫర్ వ్యాయామాలు చేస్తూ సందడి చేసారు
 • తరువాత స్విమ్మింగ్ పూల్ లో సభ్యులు సరదాగా గడిపారు, వితికాను వరుణ్ సందేశ్ స్విమ్మింగ్ పూల్ లో పడేసారు
 • నామినేట్ అయిన ఆరుగురు సభ్యులకు, ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు బిగ్ బాస్ ఒక మానిటర్ ను ఎన్నుకోమని అవకాశం ఇచ్చారు
 • నామినేట్ అయిన ఆరుగురు మానిటర్ గా హేమ ను ఎంచుకున్నారు
 • తనకేం చేయాలో అర్ధం కావడంలేదని, ఇక నుంచి సభ్యులను గమనించి నిర్ణయం తీసుకుంటానని, తనని తప్పుగా అనుకోవద్దని ఆడియన్స్ ని కోరుతూ హేమ కెమెరా వద్ద చెప్పింది
 • అయితే బాబాభాస్కర్, హేమ మాటలు వినడానికి సరదాగా ప్రయత్నం చేస్తాడు
 • బెల్ మోగిన ప్రతిసారి, ఈ ఆరుగురు సభ్యులలో ఒకరు మానిటర్ (హేమ) ని కాకుండా మిగిలిన 8 మంది సభ్యులలో ఎవరో ఒకరిని కారణాలు చెబుతూ నామినేట్ చేయొచ్చు, ఫైనల్ నిర్ణయం మాత్రం మానిటర్ హేమ నే తీసుకుంటుంది.
 • ఎపిసోడ్ 2 చివరికి వచ్చే సరికి, తాము తప్పించుకోవడానికి ఎవరిని నామినేట్ చెయ్యాలో అని అరుగులు సభ్యులు ఆలోచనలో ఉన్నారు.
 • ఎపిసోడ్ 3 లో వేరే వాళ్ళ పేరు చెప్పడం, మానిటర్ నిర్ణయంతో ప్రస్తుతం నామినేట్ అయ్యిన కొందరు ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తి విషయాలు జరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here